కన్యక
-
- కన్యక గురజాడ అప్పారావు 1912 సంవత్సరంలో రచించిన చిన్న పద్య కావ్యం. దాని పూర్తి పాఠం ఇదిగో ఇక్కడున్నది.
మొదటి భాగం
- తగటు బంగరు చీరె కట్టి
- కురుల పువ్వుల సరులు జుట్టి
- నుదుట కుంకుమ బొట్టు పెట్టి
-
-
- సొంపు పెంపారన్;
-
- తొగల కాంతులు కనులు పరపగ
- మించు తళుకులు నగలు నెరపగ
- నడక లంచకు నడలు కరపగ
-
-
- కన్నె పరతెంచెన్ రాజవీథిని.
-
- పసిడి కడవల పాలు పెరుగులు
- పళ్లెరమ్ముల పళ్ళు పువ్వులు
- మోము లందున మొలక నవ్వులు
-
-
- చెలగ చెలికత్తెల్ వెంట నడిచిరి.
-
- అంత పట్టపు రాజు యెదురై
- కన్నె సొగసుకు కన్ను చెదురై
- మరుని వాడికి గుండె బెదురై
-
-
- యిట్లు తలపోసెన్.
-
- "ఔర ! చుక్కల నడుమ చందురు
- నట్లు వెలిగెడు కన్నె ముందర
- వన్నె కాంచిన నగరి సుందరు
-
-
- లంద రొక లెక్కా !
-
- "పట్టవలెరా దీని బలిమిని
- కొట్టవలెరా మరుని రాజ్యం
- కట్టవలెరా గండపెండెం
-
-
- రసిక మండలిలో."
-
- నాల నడమను నట్టి వీథిని
- దుష్ట మంత్రులు తాను పెండెం
- గట్టి కన్నెను చుట్టి నరపతి
-
-
- పట్ట నుంకించెన్.
-
- "ముట్టబోకుడు, దేవకార్యం
- తీర్చి వచ్చెద, నీవు పట్టం
- యేలు రాజువు, సెట్టి కూతర
-
-
- నెటకు పోనేర్తున్.
-
- చుట్టములు తన చుట్టు నిలవగ
- భ్రుత్య వర్గం కాచి కొలవగ
- సెట్టి కరములు మోడ్చి రాజుకు
-
-
- ఇట్లు వినిపించెన్.
-
- "పట్టమేలే రాజ ! బలిమిని
- పట్టవలెనా ? నీదు సొమ్మే
- కాద కన్నియ ? నీవు కోరుట
-
-
- కన్న మరి కలదా వైశ్యజాతికి వన్నె ?
-
- "గాని మన్నన జేసి మమ్ముల
- బంధువర్గం, కులం పెద్దల
- ధర్మమన్నది అరసి కొంచెం
-
-
- దారి కనబడితే,
-
- అగ్నిసాక్షిగ కన్నె గైకొని
- ఆదరించుము మమ్ము, కానుక
- లందు కొమ్మెంతంత వలసిన,
-
-
- మనుచు మాజాతిన్."
-
- నవ్వి హేళన నవ్వు, నరపతి
- పల్కె, "నోహో! ధర్మ మార్గం
- పట్టమేలే రాచబిడ్డకు
-
-
- సెట్టి కరపడమా !
-
- "రాజు తలచిందేను ధర్మం
- రాజు చెప్పిందెల్ల శాస్త్రం
- రాజులకు పేరైన పద్ధతి
-
-
- కాద, గాంధర్వం ?
-
- "తడవు చెయ్యక తల్లడిల్లక
- నేడు రేపని గడువు పెట్టక,
- నెమ్మి గోరితివేని, కన్నియ
-
-
- నిమ్ము! లేకుంటే, పొమ్ము!
-
- "డేగ, పిట్టను పట్టి విడుచున ?
- కన్నె, యింటికి మరలి నడచున,
- తెమ్ము కానుక లిమ్ము, నీవిటు
-
-
- వచ్చినందాకన్,
-
- కదల"; నంతట సెట్టి పలికెను,
- "దేవకార్యం ముందు, ఆవల
- రాచకార్యం కాద, రాజా !
-
-
- శలవు నీవిస్తే.
-
- "యింటి దైవం వీరభద్రుడి
- దేవళానికి పోయి యిప్పుడె
- పళ్లెరం సాగించి వత్తును,
-
-
- పైని తమ చిత్తం !"
-
- "మంచిదే, మరి నడువు, మేమును
- తోడ వత్తుము, దేవళంలో
- అగ్ని సాక్షిగ కన్యకను మే
-
-
- మందుకొన గలము."
రెండవ భాగం
-
- నాడు గుడిలో మండె గుండం
- మంట మింటిని ముట్టి యాడగ,
- కన్న నరపతి గుండె దిగులై
-
-
- పట్టు విడ జొచ్చెన్.
-
- భక్తి పరవశ మైన మనసున
- దుర్గ నప్పుడు కొలిచి, కన్యక
- ముక్తి వేడుచు వూడ్చి నగలను
-
-
- శక్తి కర్పించెన్.
-
- దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట
- రక్త గంధం రక్త మూల్యం
- దాల్చి, గుండం చుట్టు నిలిచిన,
-
-
- జనుల కిట్లనియెన్ !
-
- "అన్న లారా తండ్రులారా
- ఆలకించం డొక్క విన్నప
- మాలు బిడ్డల కాసు కొనుటకు
-
-
- ఆశలే దొక్కొ కులము లోపల ?
-
- "పట్టమేలే రాజు అయితే
- రాజు నేలే దైవ ముండడొ ?
- పరువు నిలపను పౌరుషము మీ
-
-
- కేల కలగదొకో ?
-
- "విద్య నేర్చినవాడు విప్రుడు
- వీర్య ముండిన వాడు క్షత్రియు
- డన్న పెద్దల ధర్మ పద్ధతి
-
-
- మరచి, పదవులకై
-
- "ఆశ చేయక, కాసు వీసం
- కలిగి వుంటే చాలు ననుకొని,
- వీర్య మెరుగక, విద్య నేర్చక
-
-
- బుద్ధి మాలినచో,
-
- కలగవా యిక్కట్లు ? మేల్కొని,
- బుద్ధి బలమును బాహు బలమును
- పెంచి, దైవము నందు భారం
-
-
- వుంచి, రాజులలో
-
- "రాజులై మను డయ్య !" ఇట్లని
- కన్య నరపతి కప్పుడెదురై
- నాలు గడుడులు నడిచి ముందుకు
-
-
- పలికె నీ రీతిన్.
-
- "పట్టపగలే, వీధిని
- పట్టబోరే జార చోరులు,
- పట్టదలచితి వింక నీవొక
-
-
- పట్టమేలే రాజువట !
-
- "కండకావర మెక్కి నీవీ
- దుండగము తలపెట్టినందుకు
- వుండదా వొక దైవమంటూ,
-
-
- వుండి వూర్కొనునా ?
-
- "కులం పెద్దలు కూడి రదుగో !
- అగ్నిసాక్షికి అగ్ని అదుగో !
- కన్ను కోరిన కన్నె యిదుగో !
-
-
- జాల మేలిక్కో ?
-
- "పట్టమేలే రాజువైతే
- పట్టు నన్నిపు" డనుచు కన్యక
- చుట్టి ముట్టిన మంట లోనికి
-
-
- మట్టి తా జనియన్ !
-
- పట్టమేలే రాజు గర్వం
- మట్టి గలిసెను, కోట పేటలు
- కూలి, నక్కల కాటపట్టయి
-
-
- అమరె,
-
- యెక్కడైతే కన్య, మానం
- కాచుకొనుటకు మంట గలిసెనొ
- అక్కడొక్కటి లేచె సౌధము
-
-
- ఆకసము పొడుగై.
-
- పట్టమేలే రాజు పోయెను,
- మట్టి కలిసెను కోట పేటలు,
- పదం పద్యం పట్టి నిలిచెను
-
-
- కీర్తులపకీర్తుల్.
No comments:
Post a Comment