మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్
-
-
- పాడి పంటలు పొంగిపొరలే
- దారిలో నువు పాటు పడవోయ్
- తిండి కలిగితే కండ కలదోయ్
- కండ కలవాడేను మనిషోయ్
- పాడి పంటలు పొంగిపొరలే
-
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
-
-
- అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
- దేశి సరుకుల నమ్మవలెనోయి;
- డబ్బు తేలేనట్టి నరులకు
- కీర్తి సంపద లబ్బవోయి
- అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
-
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
-
-
- పూను స్పర్థను విద్యలందే
- వైరములు వాణిజ్యమందే;
- వ్యర్థ కలహం పెంచబోకోయ్
- కత్తి వైరం కాల్చవోయ్
- పూను స్పర్థను విద్యలందే
-
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
-
-
- ఓర్వలేమి పిశాచి దేశం
- మూలుగులు పీల్చే సెనోయ్;
- ఒరుల మేలుకు సంతసిస్తూ
- ఐకమత్యం నేర్చవోయ్
- ఓర్వలేమి పిశాచి దేశం
-
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
-
-
- సొంత లాభం కొంత మానుకు
- పొరుగు వానికి తోడుపడవోయ్
- దేశమంటే మట్టి కాదోయ్
- దేశమంటే మనుషులోయ్
- సొంత లాభం కొంత మానుకు
-
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
-
-
- మతం వేరైతేను యేమోయ్
- మనసు లొకటై మనుషులుంటే;
- జాతమన్నది లేచి పెరిగి
- లోకమున రాణించునోయ్
- మతం వేరైతేను యేమోయ్
-
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
-
-
- ఆకులందున అణగిమణగీ
- కవిత కోవిల పలకవలెనోయ్;
- పలుకులను విని దేశమందభి
- మానములు మొలకెత్తవలెనోయ్
- ఆకులందున అణగిమణగీ
-
No comments:
Post a Comment